: మూడు గ్రామాలను దత్తత తీసుకున్న అశోక్ గజపతిరాజు
సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన పథకం ద్వారా కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు. విజయనగరం జిల్లాలోని ద్వారపూడి, మొగడ, సారిపల్లి గ్రామాలను ఎంపిక చేసుకున్నట్టు అశోక్ తెలిపారు. ఈ మూడు గ్రామాలను ఏడాదికి ఒకటి చొప్పున అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.