: మోదీకి ఆహ్వానం పలికేందుకు టీడీపీ ఆస్ట్రేలియా విభాగం సన్నాహకాలు


ఈ నెల 17న ప్రధాని మోదీ ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ ఆస్ట్రేలియా విభాగం సన్నాహకాలు చేస్తోంది. హుదూద్ తుపాను బాధితులకు తక్షణ సాయంగా రూ. 1000 కోట్లను ప్రకటించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలపనుంది. అంతేకాకుండా, తుపాను బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఈ నెల 16న సిడ్నీలోని పర్రమట్ట పార్కులో కార్తీక సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తుపాను బాధితుల సహాయార్థం విరాళాలను సేకరించి ఏపీ ప్రభుత్వానికి పంపనున్నారు.

  • Loading...

More Telugu News