: విండీస్ క్రికెటర్ల బాటలో జింబాబ్వే క్రికెటర్లు
పారితోషికాల విషయంలో బోర్డుతో గొడవపడిన విండీస్ క్రికెటర్లు భారత పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం... అంతర్జాతీయ క్రికెట్ ను ఓ కుదుపు కుదిపింది. ఇప్పుడు అలాంటి ఉపద్రవమే మరొకటి ముంచుకొచ్చింది. జింబాబ్వే క్రికెటర్లు పారితోషికాలు పెంచాలంటూ సమ్మెకు దిగారు. తమకిస్తున్న పారితోషికాలు ఏ మాత్రం సరిపోవని... సగం జీతం పన్నుల రూపంలోనే పోతోందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ పారితోషికాలను పెంచేంతవరకు క్రికెట్ ఆడమంటూ బోర్డుకు స్పష్టం చేశారు.