: అంగ్ సాన్ సూకీతో భేటీ అయిన మోదీ
భారత్ తో తనకున్న అనుబంధం చాలా గొప్పదని... భారత్ తనకు మరో ఇల్లులాంటిదని నోబెల్ పురస్కార గ్రహీత, మయన్మార్ ప్రతిపక్ష నేత అంగ్ సాన్ సూకీ అన్నారు. మయన్మార్ లో జరుగుతున్న 12వ ఏసియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ పలువురు నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో సూకీతో కూడా మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెను భారత్ కు ఆహ్వానించారు మోదీ. చర్చ సందర్భంగా భారత్ తో తనకున్న అనుబంధాన్ని మోదీతో పంచుకున్నారు సూకీ. ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో ఆమె చదువుకున్నారు.