: చెలరేగిన చిచ్చరపిడుగు
చూడ్డానికి పొట్టిగా, కంటికి ఆనని రీతిలో కనిపించే అజింక్యా రహానే, తననంతా చిచ్చరపిడుగని ఎందుకు అంటారో మరో్సారి నిరూపించాడు. ఐపీఎల్ గత సీజన్ లో ప్రత్యర్థులకు తన బ్యాట్ పవర్ రుచి చూపిన రహానే తాజా సీజన్ లోనూ రాజస్థాన్ రాయల్స్ తరుపున రాణిస్తున్నాడు. జైపూర్లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో రహానే ఓపెనర్ గా బరిలో దిగి 54 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. రహానే స్కోరులో 8 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. రహానేకు తోడు యాజ్ఞిక్ (34), వాట్సన్ (31), హాడ్జ్ (21 నాటౌట్)లు రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 179 పరుగుల భారీ స్కోరు సాధించింది.