: రజనీకాంత్ 'లింగ' చిత్రం విడుదల ఆపాలంటూ పిటిషన్
తమిళనటుడు రజనీకాంత్ తాజా చిత్రం 'లింగ' విడుదలను నిలిపివేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ లో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమా కథ 2013లో రిలీజ్ అయిన తన చిత్రం 'ముల్లం వనమ్ 999' కథేనని పేర్కొంటూ రవి రతినం అనే నిర్మాత పిటిషన్ దాఖలు చేశారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.