: ఆర్మీ ర్యాలీలో తొక్కిసలాట... పలువురికి గాయాలు
గ్వాలియర్ లో జరిగిన ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి ఆరుగురికి గాయాలయ్యాయి. గ్వాలియర్ లోని మేళా గ్రౌండ్స్ లో సైన్యంలో నియామకాలు జరుగుతున్నాయని తెలిసి సుమారు 15000 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. చివరి నిమిషంలో నియామకాలను రద్దు చేస్తున్నట్టు సైనిక అధికారులు ప్రకటించటం గందరగోళానికి, ఆపై తొక్కిసలాటకు దారితీసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన కొందరు మిలిటరీ అధికారుల వాహనాలకు నిప్పు పెట్టారని, పోలీసులు తొలుత టియర్ గ్యాస్ ను ప్రయోగించినా ఫలితం లేకపోవటంతో లాఠిఛార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. సరైన ఏర్పాట్లను సైనికాధికారులు చేయలేక పోవటమే ఇందుకు కారణమని వివరించారు.