: ఐసీసీ ఓడీఐ టాప్ ఫైవ్ 'బ్యాట్స్ మెన్స్ ర్యాంకింగ్స్'లో కోహ్లీ, ధావన్


ఐసీసీ తాజాగా విడుదల చేసిన ఓడీఐ 'బ్యాట్స్ మెన్స్ ర్యాంకింగ్స్'లో భారత బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ (3వ స్థానం), శిఖర్ ధావన్ (5వ స్థానం)లు నిలిచారు. శ్రీలంకతో ఓడీఐ సిరీస్ లో తొలి మూడు మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ధావన్, తొలి ఐదు స్థానాల్లో పేరు నిలుపుకున్నాడు. ఈ క్రమంలో 94.33 సగటుతో ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో అతను అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక స్థానం కిందకు దిగి ఏడవ పొజిషన్ తో సరిపెట్టుకున్నాడు. అటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఎబి డివిలియర్స్, హషీమ్ ఆమ్లాలు ఎప్పటిలాగే తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News