: రేవంత్ రెడ్డిపై సభలో మహిళా సభ్యుల మూకుమ్మడి దాడి
తెలంగాణ శాసనసభలో టీడీపీ తరఫున ఒంటరి పోరు సాగిస్తున్న రేవంత్ రెడ్డికి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. నిజామాబాద్ ఎంపీకి సంబంధించిన సమగ్ర సర్వే వివరాలపై ఆయన చేసిన వ్యాఖ్యలతో మహిళా సభ్యులు ఒక్కసారిగా రేవంత్ మీద ఒంటికాలిపై లేచారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ, రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. సభలో లేని వ్యక్తి గురించి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్న కనీస అవగాహన లేని రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యం ఏదో ఒక అంశంపై సభలో రాద్ధాంతం చేస్తున్న రేవంత్ రెడ్డిని నిలువరించాల్సిందేనని ఆమె స్పీకర్ ను కోరారు. హెరిటేజ్ పై అసత్య ఆరోపణలు చేసిన కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన సందర్భంగా నిజామాబాద్ ఎంపీ సమగ్ర సర్వేలో రెండు చోట్ల తన వివరాలను నమోదు చేయించుకున్నారని వ్యాఖ్యానించారు. దీంతో టీఆర్ఎస్ సభ్యులు ఆయనపై మూకుమ్మడి దాడికి దిగారు.