: 50 కోట్లు దాటిన ఫేస్ బుక్ మెసెంజర్ యూజర్లు


సోషల్ నెట్ వర్క్ దిగ్గజం ఫేస్ బుక్ ఏడాది క్రితం విడుదల చేసిన మెసెంజర్ యాప్ లో చేరిన నెటిజన్ల సంఖ్య 50 కోట్లు దాటింది. మెసెంజర్ యాప్ అంటే మొదట్లో అంతగా ఆసక్తి చూపని నెటిజన్లు క్రమంగా దానికి అలవాటు పడ్డారు. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది ఈ యాప్ ను వాడుతున్నారు. గత ఏప్రిల్లో ఈ యాప్ ను వాడిన వారి సంఖ్య 20 కోట్లు మాత్రమే. సాధారణ ఫేస్ బుక్ తరువాత తాము విడుదల చేసిన యాప్ ఇదేనని, చాటింగ్ ను సులభతరం చేయడానికి దీన్ని రూపొందించామని ఫేస్ బుక్ ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ పీటర్ మార్టినజ్జీ తన బ్లాగులో తెలిపారు. పేస్ బుక్ మెసెంజర్ వేగాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ యాప్ ను విడుదల చేస్తున్నట్లు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బెర్గ్ ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించారు. అప్పటినుంచి క్రమంగా దీనికి ఆదరణ పెరుగుతూ వస్తోంది.

  • Loading...

More Telugu News