: ఆదాయం పెరగలేదు... ఇలాంటి బడ్జెట్ ఎలా పెట్టారు?: అక్బరుద్దీన్ ఒవైసీ


తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి నాలుగు నెలలయినా ఏమాత్రం ఆదాయం పెరగలేదన్నారు. అయినా ఆర్థికమంత్రి ఇంత ఆశావహ బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టారో తనకు అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రూ.29వేల రుణభారం ఉందన్న ఒవైసీ, అప్పులకు ఎంత వడ్డీ కడుతున్నామన్న లెక్కలను బడ్జెట్ లో చూపలేదని చెప్పారు. విభజన తరువాత ఇప్పటికీ వక్ఫ్ నిధులు రెండు రాష్ట్రాలకు కేటాయించలేదని, ఆ నిధులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News