: నెహ్రూ వెబ్ సైట్ లో వాజ్ పేయి కొటేషన్


దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 17,18 తేదీల్లో కాంగ్రెస్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెహ్రూపై మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి పేర్కొన్న కొటేషన్ ను ఆ రోజు ప్రారంభించనున్న ప్రత్యేక వెబ్ సైట్ లో చేర్చింది. nehruinternationalconference2014.com పేరుతో రూపొందించిన సైట్ ను సదస్సు రోజున కాంగ్రెస్ ప్రారంభిస్తుంది. అందులో నెహ్రూ జీవితం, ఆయన రచనలు, కొటేషన్ లు, ఆయన ప్రముఖ ప్రసంగాలు ఉంటాయి. అందులో ప్రముఖ వ్యక్తులు మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐదేళ్ళ పూర్తి కాలం పదవిలో వున్న మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి వాజ్ పేయిలు నెహ్రూపై చేసిన వ్యాఖ్యలను కూడా సైట్ లో చేర్చారు. "వ్యక్తిగత స్వేచ్ఛకు ఆయన న్యాయవాదిలాంటివాడు. ఇప్పుడు ఆర్థిక సమానత్వం తీసుకురావాలన్న దానికి కట్టుబడి ఉన్నారు. ఎవరితోనైనా రాజీపడేందుకు ఆయన ఎప్పుడూ భయపడలేదు, అలాగని భయపడి కూడా ఎవరితోనూ రాజీపడరు" అని నెహ్రూ గురించి ఒకప్పుడు వాజ్ పేయి పేర్కొన్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వానికి ప్రధానిగా పూర్తికాలం పనిచేసిన వాజ్ పేయి 'భారతీయ రాజనీతిజ్ఞుడు'గా పేరుతెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News