: బీజేపీకి అనుకూలంగా ఓటు వేసేది లేదు: శివసేన
మహారాష్ట్రలో బీజేపీ సర్కారుకు అనుకూలంగా ఓటు వేసే సమస్యే లేదని శివ సేన స్పష్టం చేసింది. తాము ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ నేత రాందాస్ కదం బుధవారం ఉదయం వ్యాఖ్యానించారు. గత రాత్రి బీజేపీతో తాము ఎలాంటి చర్చలు జరపలేదని తెలిపారు. ఇక స్పీకర్ ఎంపిక విషయంలో శివసేన అభ్యర్థిని వెనక్కు తీసుకునే దిశగా ఇంకా ఆలోచించలేదని చెప్పారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లుండగా బీజేపీకి 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాస పరీక్ష గెలవటానికి మొత్తం 144 మంది సభ్యుల అవసరం ఉంది. ఇప్పటికే ఎన్సీపీ మద్దతు తీసుకోవాలని బీజేపీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.