: ఎట్టకేలకు తల్లి ఒడికి చేరిన విజయవాడ బాలుడు!
విజయవాడలో అదృశ్యమైన 15 నెలల బాలుడు చందు స్వరూప్ ఎట్టకేలకు తల్లి ఒడి చేరాడు. ఈ కుర్రాడు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నంలోని ఓ చర్చి ఫాదర్ వద్దకు చేరాడు. ఓ టీవీ ఛానెల్ లో బాలుడి అదృశ్యంపై వార్తలు రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఒంటరిగా కనిపించిన బాలుడిని చేరదీసినట్లు చర్చి ఫాదర్ చెప్పారు. బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు అంగీకరించారు. దీంతో బాలుడు చివరకు తల్లి ఒడికి చేరాడు. అయితే, విజయవాడ నుంచి స్వరూప్ కొమరగిరిపట్నం ఎలా చేరాడన్న విషయం తెలియరాలేదు.