: ఎన్సీపీ మద్దతు ఎలా తీసుకుంటారు?: ఫడ్నవీస్ సర్కారుపై శివసేన మండిపాటు


నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మద్దతు తీసుకునేందుకు సమాయత్తమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేేవేంద్ర ఫడ్నవీస్ సర్కారుపై శివసేన శివాలెత్తింది. పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన ఆ పార్టీతో కలిసి ఎలా సాగుతారంటూ శివసేన సొంత పత్రిక సామ్నా బుధవారం నాటి తన ఎడిటోరియల్ కథనంలో నిలదీసింది. అవినీతి మకిలి అంటిన ఎన్సీపీతో అంటకాగుతూ మహారాష్ట్రలో ఎలా నీతివంత పాలన సాగిస్తారని ప్రశ్నించింది. మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఫడ్నవీస్ నేడు విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. మద్దతుపై శివసేన ఊగిసలాట ధోరణి అవలంబిస్తున్న నేపథ్యంలో బేషరతు మద్దతు ప్రకటించిన ఎన్సీపీ సహాయంతో విశ్వాస పరీక్షలో గట్టెక్కేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News