: పెళ్లి పేరుతో చిత్తూరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఘరానా మోసం!


పెళ్లి పేరిట అమ్మాయిలను బుట్టలో వేసిన చిత్తూరు జిల్లా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉదంతం బుధవారం వెలుగు చూసింది. మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో తన ప్రొఫైల్ పెట్టిన శశికుమార్ దాదాపు 20 మంది అమ్మాయిలను వలలో వేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శశికుమార్ వలకు చిక్కిన అమ్మాయిల్లో హైదరాబాదీ అమ్మాయిలు కూడా ఉన్నట్లు సమాచారం. అమ్మాయిలను ఆకట్టుకున్న శశికుమార్ వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను లాగేసినట్లు సమాచారం. ఆ డబ్బుతో జల్సాల్లో మునిగితేలాడు. ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ పోలీసుల అదుపులో ఉన్న శశికుమార్ స్వస్థలం చిత్తూరు జిల్లా గుడిపాల మండలంగా తేలింది.

  • Loading...

More Telugu News