: ఏపీలో రెట్టింపైన స్థిరాస్తి విక్రయాలు...సర్కారుకు భారీ ఆదాయం!
రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ లో స్థిరాస్తి క్రయ విక్రయాలు పరుగులు పెడుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో స్థిరాస్తి విక్రయాల్లో ఏకంగా 93 శాతం వృద్ధి నమోదైంది. దీంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా దాదాపుగా రెట్టింపైంది. స్థిరాస్తి విక్రయాల ద్వారా ప్రభుత్వానికి గడచిన ఆరు నెలల్లోనే రూ.1,316 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఇక నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు కానున్న తుళ్లూరు పరిసర జిల్లాల్లో క్రయ విక్రయాలు రెట్టింపు స్థాయిని దాటిపోయాయి. రాష్ట్ర పరిధిలోని ఏడు జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు రెట్టింపయ్యాయి.