: టీడీపీ మీడియా కమిటీ ఛైర్మన్ ప్రసాద్ కు అమెరికా 'టాకో' ఆహ్వానం!
తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్వీ ఎస్సార్కే ప్రసాద్ కు అమెరికా టాకో సభలకు ఆహ్వానం అందింది. ఈ మేరకు అమెరికా టాకో సభల నిర్వాహకుల నుంచి ఆయనకు మంగళవారం ఆహ్వానం అందింది. ఈ నెల 15 నుంచి 30 దాకా అమెరికా నగరం కొలంబస్ లో టాకో సభలు జరగనున్నాయి. 1983లో ప్రారంభమైన తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహాయో (టాకో) అమెరికాలో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏటా కార్యక్రమాలను చేపడుతోంది. అమెరికా వ్యాప్తంగా ఉన్న ఉన్న తెలుగు వారిలో 2,500 మంది దాకా హాజరుకానున్న ఈ సదస్సుకు ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇటీవల ఉత్తరాంధ్రను కుదిపేసిన హుదూద్ సహాయార్థం టాకో సభలు ప్రసాద్ ద్వారా భారీ ఆర్థిక సహాయాన్ని పంపే అవకాశాలున్నాయి.