: ఐఎస్ఐఎస్ చీఫ్ హతమైనట్టు సమాచారం లేదు: అమెరికా
అమెరికా దాడుల్లో ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ వర్గాలు స్పందించాయి. బాగ్దాదీ మరణించినట్టు సమాచారం లేదని తెలిపాయి. ఐఎస్ఐఎస్ చీఫ్ ను లక్ష్యంగా చేసుకుని దాడి జరపలేదని, ఆ మిలిటెంట్ గ్రూపు కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపామని అధికార ప్రతినిధి జెన్ సాకీ పేర్కొన్నారు. శనివారం రాత్రి ఇరాక్ లోని మోసుల్ వద్ద 10 సాయుధ వాహనాలపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లోనే బాగ్దాదీ గాయపడినట్టు తెలుస్తోంది.