: తెలంగాణలో గిరిజనేతర రైతులకూ రుణమాఫీ: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రంలో గిరిజనేతర రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అటవీప్రాంతాల్లో సాగు చేస్తున్న రైతులందరికీ మాఫీ వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు అసెంబ్లీలోని పార్టీ కార్యాలయంలో గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమై చర్చించారు. వారి రుణమాఫీకి సంబంధించి నివేదిక ఇవ్వాలని మహబూబ్ నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. కలెక్టర్ల నివేదిక ఆధారంగా మాఫీ అమలు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News