: చైనాను నమ్మితే దేశ సరిహద్దులు సురక్షితంగా ఉండవు: ములాయం


చైనా విషయంలో సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 'మోసకారి' లాంటి దేశంపై ప్రధానమంత్రి నమ్మకం పెట్టుకుంటే భారత సరిహద్దులకు రక్షణ ఉండదన్నారు. ఈ మేరకు లక్నోలో ఓ సెమినార్లో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని 'పిరికిపంద'గా వ్యాఖ్యానించారు. దేశ సరిహద్దులలో పర్వతాల ద్వారా చైనా రహదారులు నిర్మిస్తోందన్నారు. అయితే, ఈ ప్రభుత్వం పిరికిదని, దేశాన్ని రక్షించలేదని విమర్శించారు. తాను రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చైనా, పాకిస్థాన్ లు దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించేందుకు ధైర్యం చేసేవి కాదన్నారు. ప్రస్తుతం దేశ రక్షణపై పలు ప్రశ్నార్ధకాలు తలెత్తుతున్నాయని ములాయం చెప్పారు. ఈ సమయంలో సైనిక దళాల్లో ధైర్యాన్ని నింపడం చాలా ముఖ్యమని సూచించారు.

  • Loading...

More Telugu News