: నెహ్రూ జయంతి కార్యక్రమానికి కాంగ్రెస్ నుంచి మోదీకి ఆహ్వానం లేదు!
భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతిని ఈ నెల 14న కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించనుంది. ఈ క్రమంలో ఢిల్లీలో 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్' ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఇతర దేశాల నుంచి పదిహేను రాజకీయ పార్టీలను పిలిచింది. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాత్రం కాంగ్రెస్ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఈ మేరకు కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ రెండు రోజుల ఆ కాన్ఫరెన్స్ కు సంబంధించిర విషయాలు తెలుపుతూ, ప్రధానిని కానీ, ఆయన పార్టీ బీజేపీని కానీ, వారి సంకీర్ణ పార్టీలను కానీ పిలవలేదని చెప్పారు. కాగా, ఆహ్వానం అందుకున్న వారిలో చెైనా కమ్యూనిస్ట్ పార్టీ నేతలు, ప్రపంచంలోని పలు నేతలు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటామని చెప్పినట్టు శర్మ వెల్లడించారు. మరోపక్క, అటు ప్రధాని మోదీ పది రోజుల విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.