: కూతురి పెళ్లి ఓ ఖర్చు... ఎన్నికల ఆఫిడవిట్ లో పేర్కొన్న కాంగ్రెస్ అభ్యర్థి


గర్భస్థ శిశు హత్యల నుంచి, వీధుల్లో వేధింపుల వరకు ఆడపిల్లల విషయంలో భారత్ ది విఫల ప్రస్థానమే. సామాన్య ప్రజల నుంచి ప్రజా ప్రతినిధులు, సెలెబ్రిటీలు, బడాబాబులు ఎందరో తమ సొంత విషయానికి వచ్చేసరికి ఎక్కడో ఒక చోట మహిళలపై వివక్ష చూపిన వారే. తాజాగా, ఓ బాధ్యతగా భావించాల్సిన కూతురి పెళ్లిని ఓ ఖర్చుగా చుపించాడో ప్రజా ప్రతినిధి. జమ్మూ కాశ్మీర్ లోని గందేర్బాల్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటికి దిగిన మహమ్మద్ యూసఫ్ భట్ తన నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా కుమార్తె వివాహాన్ని 'లయబిలిటీస్' విభాగంలో పొందుపరిచాడు. ఆపై, పెళ్లి కాని కూతురు తండ్రికి భారమే కదా? అని ప్రశ్నించాడు కూడా. ఈ ఉదంతంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, దిగివచ్చిన భట్ మాట మారుస్తూ 'రెస్పాన్సిబిలిటీ, లయబిలిటీ మధ్య తేడాను తను అర్ధం చేసుకోలేకపోయా'నని వివరణ ఇచ్చాడు.

  • Loading...

More Telugu News