: పాక్ స్కూళ్లలో మలాలా వ్యతిరేక దినం
ప్రపంచమంతటా నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్ జాయ్ ని కీర్తిస్తుంటే, పాకిస్తాన్ లో మాత్రం మలాలా వ్యతిరేక దినాన్ని 'అయామ్ నాట్ మలాలా' పేరిట నిర్వహించారు. వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీకి ఆమె మద్దతు పలకడమే అందుకు కారణం. బాలికల హక్కుల కోసం పోరాడుతున్న మలాలాను పశ్చిమ దేశాల ఏజెంట్ అని, మలాలా చేస్తున్న పనులు దేశానికి సిగ్గుచేటని పాకిస్తాన్లో కొందరు విమర్శిస్తున్నారు. 2012 అక్టోబరులో తాలిబాన్ల కాల్పులకు గురైన మలాలా, ఆపై చికిత్స పొంది అంచెలంచెలుగా ఎదిగిన సంగతి తెలిసిందే. పాక్ లోని ప్రైవేటు పాఠశాలలన్నీ మలాలా రాసిన 'అయామ్ మలాలా' పుస్తకాన్ని నిషేధించాయి. ఈ పుస్తకంలో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఉన్నాయన్నది వారి వాదన.