: ఈనెల 28న జీకే వాసన్ కొత్త పార్టీ
ఇటీవల తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, పార్టీ నుంచి బయటికి వచ్చిన జీకే వాసన్ ఈ నెల 28న కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. తమిళనాడులోని తిరుచురాపల్లిలోని పొన్ మలై బహిరంగ సభలో పార్టీ పేరు వెల్లడిస్తానని చెప్పారు. ఈ మేరకు మహిళా మద్దతుదారుల సమావేశంలో వాసన్ మాట్లాడుతూ, ఎక్కడైతే పార్టీ పేరు చెబుతానో, అక్కడే పార్టీ జెండా కూడా ఎగురవేస్తానని అన్నారు. ఒక్క తమిళనాడేకాక, దేశం మొత్తం చూసేలా ఈ సభ ఉంటుందన్నారు.