: మయన్మార్ చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో మయన్మార్ చేరుకున్నారు. ప్రస్తుతం రాజధాని 'నెఫ్యూ ద్యూ'లో ఉన్న ప్రధాని, 'ఎసీయన్' (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్), ఈస్ట్ ఏషియా సమ్మిట్ లో పాల్గొంటారు. ఇదే సమయంలో పలుదేశాల అధినేతలతోనూ మోదీ సమావేశమవుతారు. మయన్మార్ సహా ఆస్ట్రేలియా, ఫిజీ దేశాల్లో ప్రధాని పర్యటన పదిరోజుల పాటు సాగుతుంది.