: అక్కడ విద్యార్థులు తింటున్నది నాసి రకం భోజనం!
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులు తింటున్నది ఏమంత పోషకాహారం కాదని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. సమాచార హక్కు చట్టం కింద రాజనాథ్ బన్సాల్ అనే వ్యక్తి అడిగిన ఓ ప్రశ్నకు ఢిల్లీ విద్యా విభాగం అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం గడచిన ఐదేళ్ళలో శాంపిల్ పరీక్షకు సేకరించిన ఆహార పదార్థాలలో 88 శాతం నాణ్యత, పోషక ప్రమాణాలలో విఫలమయ్యాయి. మొత్తం 2,244 సార్లు శాంపిల్ పరీక్షలు నిర్వహించగా, 246 సార్లు మాత్రమే ఆహారంలోని పోషకాలు సంతృప్తికరంగా ఉన్నాయని వివరించారు. పేద విద్యార్థులకు మరో అవకాశం లేకనే ఈ తరహా నాణ్యత లేని ఆహారం తినాల్సి వస్తోందని, కేటాయిస్తున్న నిధులన్నీ సద్వినియోగం అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని బన్సాల్ వ్యాఖ్యానించాడు.