: నిజాం చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంపై మండలిలో చర్చ... తీవ్ర వాగ్వాదం


అవకాశం వచ్చినప్పుడల్లా నిజాంను కీర్తించే టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్... ఇప్పుడు పాఠ్యాంశాల్లో కూడా నిజాంల చరిత్రను పొందుపరిచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో, నిజాం చరిత్రను పాఠ్యాంశంలో చేర్చే అంశంపై శాసనమండలిలో చర్చిస్తున్నారు. ఈ విషయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. రజాకార్ల అండతో నిజాంలు అనేక అకృత్యాలు చేశారని... అలాంటి వారి చరిత్రను పుస్తకాల్లో ఎలా పెడతారని విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, నిజాం మంచి పాలనతో పాటు వ్యతిరేక కార్యకలాపాలను కూడా పాఠ్యాంశంలో చేరుస్తామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మండలిలో పరిస్థితి గందరగోళంగా ఉంది.

  • Loading...

More Telugu News