: మార్కెట్ లోకి తొలి మైక్రోసాఫ్ట్ 'ల్యూమియా' ఫోన్


మైక్రోసాఫ్ట్ తన తొలి 'ల్యూమియా' ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. నోకియా పేరును తొలగించిన తరువాత కొత్త పేరుతో వచ్చిన స్మార్ట్ ఫోన్ ఇది. కేవలం 110 యూరోల (135 అమెరికన్ డాలర్లు) ధరతో 'మైక్రోసాఫ్ట్ ల్యూమియా 535' పేరుతో రిలీజ్ చేసింది. ఈ ఏడాది పలు ల్యూమియా మోడల్స్ ను కంపెనీ తీసుకొచ్చినప్పటికీ అవన్నీ ఇప్పటికీ నోకియా పేరుతోనే అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక ల్యూమియా 535 విషయానికొస్తే, ఐదంగుళాల స్క్రీన్, ముందు, వెనుక భాగాన ఫైవ్ మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉండటమే దీని ప్రత్యేకత. ఈ నెల నుంచే విపణిలోకి అమ్మకానికి వెళ్లనున్న ఈ ఫోన్ మార్కెట్టును ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నిస్తోంది.

  • Loading...

More Telugu News