: విద్యార్థినిని అత్యాచారం చేసి, వీడియో తీసిన 'ఎంఐఎం' నేత


అనంతపురం జిల్లా కదిరిలో దారుణం చోటు చేసుకుంది. తోటి విద్యార్థి వేధిస్తున్నాడు, అతని నుంచి రక్షణ కల్పించాలంటూ పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని స్థానిక ఎంఐఎం నాయకుడు ఇలియాజ్ ను సాయం కోరింది. సాయం చేస్తానని చెప్పిన ఇలియాజ్ ఆ విద్యార్థినిని లోబరుచుకుని, అత్యాచారం చేసి, వీడియో తీసి, బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. 'ఈ వ్యవహారాన్ని బయటకు చెబితే నీ కుటుంబ సభ్యులను చంపేస్తా'నంటూ విద్యార్థినిని బెదిరించాడు. చివరకు ధైర్యం చేసిన ఆ విద్యార్థిని... బాలల హక్కుల కోసం పోరాడుతున్న ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లా ఎస్పీని కలసి, జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇలియాజ్ కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఇలియాజ్ పరారీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News