: తెలంగాణలో నేడు మైనార్టీ సంక్షేమ దినం
తెలంగాణ రాష్ట్రంలో నేడు మైనార్టీ సంక్షేమ దినాన్ని జరుపుకుంటున్నారు. భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలామ్ అజాద్ జయంతిని మైనార్టీ దినోత్సవంగా జరుపుకోవాలని కేసీఆర్ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు రవీంద్రభారతిలో అజాద్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.