: హైదరాబాదులో తుపాకీ కాల్పులు


హైదరాబాదులో నేర సంస్కృతి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా, స్థానిక రాజేంద్రనగర్ హైదర్ గూడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి షాబుద్దీన్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. కారులో ప్రయాణిస్తున్న షాబుద్దీన్ కు ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటన జరిగిన వెంటనే, షాబుద్దీన్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. కాల్పులు జరిగిన ప్రదేశానికి వచ్చి, అక్కడున్న స్థానికులను కూడా విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News