: ఏపీ రాజధాని కమిటీలో సింగపూర్ నిపుణుడు
ఏపీ రాజధాని నిర్మాణం ఏ విధంగా ముందుకు సాగుతుందన్న విషయంలో స్పష్టత లేనప్పటికీ... సింగపూర్ మోడల్ కే చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. ఈ రోజు చంద్రబాబు సింగపూర్ వెళుతున్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ నగరాన్ని క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా, దీనికి సంబంధించి అక్కడ పలువురితో చంద్రబాబు చర్చించనున్నారు. దీనికి తోడు, తాజాగా ఏపీ రాజధాని కమిటీలో సింగపూర్ కు చెందిన నిపుణుడు ఖూ తెంగ్ కు స్థానం కల్పించారు. దీంతో, చంద్రబాబు సింగపూర్ తరహా నిర్మాణానికే మొగ్గు చూపుతున్నారనే విషయం అర్థమవుతోంది.