: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
శంషాబాద్ ఎయిర్ పోర్టును దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను ఆయా సంస్థలు రద్దు చేశాయి. దీనికితోడు, మస్కట్, షార్జా, అబుదాబి నుంచి వచ్చే విమానాలను బెంగళూరు విమానాశ్రయానికి తరలించారు. ఈ నేపథ్యంలో, మస్కట్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానం బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఎయిర్ పోర్టులో నెలకొన్న పరిస్థితులపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.