: హైదరాబాదులో స్వైన్ ఫ్లూ కలకలం... గాంధీలో 14 మందికి చికిత్స
హైదరాబాదులో స్వైన్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతోంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడ్డారు. అంతే కాకుండా విదేశాల నుంచి వచ్చిన మరో 11 మందిలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించారు. వీరందరికీ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే, చికిత్స అందిస్తున్న డాక్టర్ కు కూడా స్వైన్ ఫ్లూ సోకింది. షాకింగ్ న్యూస్ ఏమిటంటే, హైదరాబాదులో స్వైన్ ఫ్లూ మందుల కొరత ఉందట.