: అరుణ్ జైట్లీ రికార్డును బద్దలుకొట్టిన సుజనా చౌదరి
ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు అయిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రికార్డును కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ నేత సుజనా చౌదరి బద్దలు కొట్టారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో అరుణ్ జైట్లీ రూ. 113 కోట్లతో అత్యంత సంపన్నమైన మంత్రిగా ఉన్నారు. కేబినెట్లో సుజనా చౌదరి కాలుమోపడంతో జైట్లీ రికార్డు కనుమరుగైంది. రూ. 189 కోట్ల ఆస్తులతో సుజనా చౌదరి అగ్రస్థానంలో నిలిచారు. మోడీ కేబినెట్లోని మంత్రులందరూ దాదాపు కోటీశ్వరులే... వారి సగటు ఆస్తుల విలువ రూ. 14 కోట్లుగా తేలింది. మరో తెలుగు మంత్రి బండారు దత్తాత్రేయ ఈ లిస్టులో 17వ స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ. 9 కోట్లు.