: జీవన్ ప్రమాణ్ తో పెన్షనర్ల ఇక్కట్లకు చెక్!
దేశంలోని పెన్షన్ దారుల ఇక్కట్లకు చెక్ పెడుతూ కేంద్రం జీవన్ ప్రమాణ్ పేరిట కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద పెన్షనర్లు ఏటా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాక తాము జీవించి ఉన్నామంటూ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆధార్ ఆధారిత డిజిటల్ ద్రువపత్రం పెన్షన్ దారులకు అందనుంది. దీనిని స్మార్ట్ ఫోన్, పర్సనల్ కంప్యూటర్ ద్వారా ఏటా ప్రభుత్వానికి పంపితే సరిపోతుంది. వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం ఉండబోదు. ఆధునిక టెక్నాలజీపై పట్టు లేని పెన్షనర్లు తమకు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ల నుంచి కూడా ప్రభుత్వానికి తమ డిజిటల్ కార్డులను అప్ లోడ్ చేసే సౌకర్యం ఉంది. మోదీ సర్కారు చర్యతో దేశంలోని కోటి మందికి పైగా పెన్షనర్లకు పూర్తి స్థాయిలో ఉపశమనం లభించనుంది.