: నా భార్యతో వ్యభిచారం చేయిస్తున్నారు: కలెక్టర్ కు మొరపెట్టుకున్న భర్త


తెలుగు రాష్ట్రాల్లో వ్యభిచారం భారీ ఎత్తున సాగుతోంది. పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ వ్యాపారం విస్తరిస్తూనే ఉంది. మరికొన్ని చోట్ల పోలీసులే వ్యభిచార నిర్వాహకులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో, తన భార్యతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారంటూ ఓ భర్త ఏకంగా జిల్లా కలెక్టర్ ఎదుటే కన్నీరు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం గవరపేట 50వ డివిజన్ లో నివాసం ఉండే చొచ్చుపల్లి శ్రీనివాస్ భార్యను మణి అనే వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలు తీసుకెళ్లిపోయింది. తన భార్యను బలవంతంగా నిర్బంధించి, వ్యభిచారం చేయిస్తున్నారని... తన భార్యను పంపించేయాలని కోరితే, చంపుతామని బెదిరిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎదుట శ్రీనివాస్ మొరపెట్టుకున్నాడు. ఖర్చులకు డబ్బులిస్తాం, ఇక్కడనుంచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇస్తున్నారని వాపోయాడు. తన భార్యలాంటి వారు ఎంతో మంది వ్యభిచార గృహాల్లో మగ్గుతున్నారని తెలిపాడు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా కలెక్టర్ భాస్కర్ కేసును వెంటనే దర్యాప్తు చేయాలంటూ డీఎస్పీ సరితను ఆదేశించారు.

  • Loading...

More Telugu News