: చంద్రబాబును 'సీమాంధ్ర ముఖ్యమంత్రి'గా పేర్కొన్న సిద్ధరామయ్య


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిద్ధరామయ్య ప్రముఖులకు చంద్రబాబును పరిచయం చేస్తూ, 'సీమాంధ్ర ముఖ్యమంత్రి' అని పేర్కొన్నారు. పొరబాటును గుర్తించిన చంద్రబాబు చిరునవ్వుతో స్పందించారు. వెంటనే సిద్ధరామయ్య చేసిన పొరబాటును సరిదిద్దారు. భేటీ సందర్భంగా చంద్రబాబు తిరుపతి వెంకన్న ప్రతిమను సిద్ధరామయ్యకు బహుకరించారు. బదులుగా కర్ణాటక సీఎం 'మైసూరు పేటా' (ప్రత్యేక తలపాగా) ను చంద్రబాబు తలపై ఉంచారు.

  • Loading...

More Telugu News