: ప్రతిపక్షంలోనే కూర్చుంటాం: శివసేన


మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో చేరేది లేదని శివసేన స్పష్టం చేసింది. తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని, ఆ మేరకు సభలో ప్రతిపక్ష నేతగా ఏక్ నాథ్ షిండే వ్యవహరిస్తారని పేర్కొంది. శివసేన అధికార ప్రతినిధి నీలమ్ గోరే మాట్లాడుతూ, మహారాష్ట్ర అసెంబ్లీలో 287 సీట్లు ఉండగా, శివసేనకు 63 మంది ఎమ్మెల్యేల బలం ఉందన్నారు. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సంతకం చేసిన లేఖను శాసనసభ సచివాలయానికి పంపామని, ఏక్ నాథ్ షిండేను ప్రతిపక్ష నేతగా త్వరగా ప్రకటించాలని కోరామని గో్రే తెలిపారు.

  • Loading...

More Telugu News