: క్యాబినెట్ పదవి ఏపీకిచ్చి తెలంగాణ కన్ను పొడిచారు: వీహెచ్
రెండు రాష్ట్రాలు- రెండు కళ్లు అని చెప్పుకునే చంద్రబాబు క్యాబినెట్ పదవి ఏపీకిచ్చి తెలంగాణ కన్ను పొడిచారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. చంద్రబాబుకు ఏపీ అభివృద్ధే ముఖ్యమన్నారు. ఈ విషయంలో తెలంగాణ టీడీపీ నేతలు ఆలోచించాలని వీహెచ్ సూచించారు. తెలంగాణలో టీడీపీ నాయకులకు భవిష్యత్తు లేదని అన్నారు. టీడీపీ నాయకులు కాంగ్రెస్ లో చేరి టీఆర్ఎస్ పై పోరాడాలని సలహా ఇచ్చారు. ప్రధాని మోదీని కూడా వీహెచ్ విమర్శించారు. అవినీతి ఆరోపణలున్న సుజనా చౌదరికి మంత్రి పదవిచ్చి, నల్లధనంపై మాట్లాడే అర్హతను మోదీ కోల్పోయారన్నారు. .