: మోదీ క్యాబినెట్లో కొత్తగా యోగా మంత్రిత్వ శాఖ
భారత్ ఎప్పటి నుంచో అనుసరిస్తున్న యోగాను ఇప్పుడు ప్రపంచమంతా అనుసరిస్తోంది. దేశాధినేతలు, సినిమా తారలు, వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలు... ఇలా ఎందరో ప్రాచీన ఆరోగ్య విధానం విశిష్టతను గుర్తించి పాటిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయితే క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తారు. అంతటితో ఆగకుండా... ప్రజల్లోనూ యోగాపై ఆసక్తి కలిగించేందుకు, వారిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంపొందించేందుకు ఏకంగా మంత్రిత్వ శాఖగా యోగాకు ప్రముఖ స్థానం కల్పించారు. ఇప్పటివరకు ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఉన్న ఆయుష్ ను ప్రత్యేక మంత్రిత్వ శాఖగా నిన్నటి క్యాబినెట్ విస్తరణలో ప్రకటించారు. ఆయుష్ పోర్ట్ ఫోలియో కింద యోగా, నేచురోపతిలతో పాటు ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ, యునానీ తదితర వైద్య విధానాలను చేర్చారు. యశో నాయక్ ఆయుష్ మంత్రిగా బాధ్యతలు చేపడతారు.