: సబిత, ధర్మానపై చర్యల విషయంలో రేపు స్పష్టత?
రాష్ట్ర రాజకీయాలతో తలబొప్పి కట్టిన సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలు నేడంతా ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. పార్టీని వీడేందుకు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు మూటాముల్లె సర్దుకుంటుండడంపై ఆందోళన చెందిన రాష్ట్ర నాయకత్వం విధిలేని పరిస్థితుల్లో హస్తిన పయనమైంది. పార్టీ వ్యవహారాలపై సీఎం కిరణ్ నేడు సోనియాతో చర్చించగా.. బొత్స, ఆజాద్ తో సమావేశమయ్యారు.
వీరి భేటీలో ప్రధానంగా పార్టీ వ్యవహారాలతో పాటు కళంకిత మంత్రులపై చర్యలు తీసుకునే విషయం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. కాగా, సీఎం, బొత్సలు ఇదే విషయమై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రేపు సమావేశం కానున్నారు. దీంతో, ఛార్జిషీటులో పేర్లున్న మంత్రులు సబిత, ధర్మానల విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.