: చంద్రబాబు సింగపూర్ పర్యటనపై ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు
ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11 నుంచి 14 వరకు పర్యటన ఉంటుందని తెలిపింది. ఈ పర్యటనలో దక్షిణాసియా సదస్సులో ముఖ్య అతిధిగా సీఎం పాల్గొంటారని, పలు వాణిజ్య, వ్యాపార సదస్సులకు హాజరవుతారని వెల్లడించింది. బాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఏపీ ప్రభుత్వ సలహాదారులు పరకాల ప్రభాకర్, సత్యనారాయణ వెళ్లనున్నారు. అటు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు కూడా సింగపూర్ వెళుతున్నారు. వారందరితో పాటు ఐఏఎస్ అధికారులు ఎస్పీ టక్కర్, సాంబశివరావు, జేఎస్వీ ప్రసాద్, గిరిధర్ కూడా సీఎం వెంట వెళుతున్నారు.