: కర్నూలు కోర్టులో లొంగిపోయిన బైరెడ్డి


మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలు కోర్టులో లొంగిపోయారు. నందికొట్కూరు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సాయి ఈశ్వర్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయన ఆరు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు. తన తండ్రి హత్య వెనుక బైరెడ్డి, ఆయన తండ్రి శేషశయనా రెడ్డి, సోదరుడి కుమారుడు సిద్ధార్థరెడ్డి, మరికొంతమంది ఉన్నారంటూ ఈశ్వర్ రెడ్డి కొడుకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఏప్రిల్ లో కేసు నమోదు చేశారు. దాంతో, అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైన సమయంలో ఆ చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని బైరెడ్డి హైకోర్టుకు వెళ్లారు. కోర్టు అందుకు నిరాకరించడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా, ఎన్నికల ముందు రాయలసీమ సాధన సమితి పేరుతో బైరెడ్డి పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News