: తుంగభద్ర ఆధునికీకరణ చాలా కాలంగా జరగలేదు: చంద్రబాబు
తుంగభద్ర ఆధునికీకరణ చాలా కాలంగా జరగలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశం ముగిసిన అనంతరం, ఇద్దరు ముఖ్యమంత్రులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుంకేసుల, ఆర్డీఎస్ నీటి పంపకాలపై ముఖ్యమంత్రులం ఇద్దరం చర్చించామని తెలిపారు. తుంగభద్ర ఎగువ, దిగువ కాల్వల ఆధునికీకరణ చాలా కాలంగా జరగలేదని... కాల్వల ఆధునికీకరణ వల్ల కర్ణాటకతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లాలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు.