: మరోమారు ఏపీ సర్కారుపై కేసీఆర్ ఆరోపణలు


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మరోమారు ఏపీ ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు. సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణలో నెలకొన్న విద్యుత్ కొరతపై మాట్లాడిన సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. తెలంగాణకు 54 శాతం విద్యుత్ ఇవ్వాలన్న గవర్నర్ ఉత్తర్వులనే ఏపీ సర్కారు పాటించడం లేదని ఆరోపించారు. గవర్నర్ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్న ఏపీ ప్రభుత్వం, తెలంగాణను అంధకారంలోకి నెడుతోందని విమర్శించారు. అంతేకాక విద్యుత్ ఒప్పందాలను ఏపీ సర్కారు ఉల్లంఘించిందని కూడా కేసీఆర్ ఆరోపించారు. కృష్ణపట్నం నుంచి 190 మెగావాట్ల విద్యుత్ ను ఏపీ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఏపీ ప్రభుత్వ వ్యవహార సరళిపై త్వరలోనే కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నామని ఆయన ప్రకటించారు. ఇందుకోసం త్వరలోనే ఢిల్లీకి ప్రభుత్వ బృందాన్ని పంపిస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News