: మాట తప్పడం మా విధానం కాదు: హరీష్ రావు


టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని కచ్చితంగా అమలు చేస్తామని టీఎస్ మంత్రి హరీష్ రావు తెలిపారు. మాట తప్పడం తమ ప్రభుత్వ విధానం కాదని అన్నారు. ఇప్పటికే రూ. 8,123 కోట్లను రైతులకు మంజూరు చేశామని తెలిపారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెప్పి సైలెంట్ గా ఉన్న ఏపీ ప్రభుత్వంలా తాము వ్యవహరించడం లేదని, ప్రజలను మోసం చేయడం లేదని మండిపడ్డారు. ఇప్పటివరకు ఏపీలో ఒక్క రైతుకైనా రుణమాఫీ వర్తించిందా? అని ప్రశ్నించారు. శాసనసభలో మాట్లాడుతూ, హరీష్ రావు ఈ విధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News