: రైతు రుణ మాఫీకి రూ. 17 వేల కోట్లు : కేసీఆర్


రైతు రుణాల మాఫీ కోసం రూ. 17 వేల కోట్లు వెచ్చిస్తున్నామని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన సందర్భంగా కేసీఆర్ ఈ మేరకు ప్రకటించారు. ఈ స్థాయిలో రుణాలను మాఫీ చేయడం సాహసోపేతమైన నిర్ణయమేనని ఆయన తెలిపారు. ఖరీఫ్ రుణాల మంజూరులో రూ. 12 వేల కోట్లు లక్ష్యం కాగా రూ.8,100 కోట్లను రైతులకు అందించామన్నారు. మేనిఫెస్టోలోని హామీలను తమ ప్రభుత్వం విస్మరించడం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News