: రుణమాఫీ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసిన ఎర్రబెల్లి
మేనిఫెస్టోలో లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్... ఇప్పుడు కేవలం పంట రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని అంటోందని టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయా్కర్ రావు మండిపడ్డారు. స్వల్ప, దీర్ఘకాలిక రుణాలన్నింటినీ మాఫీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లోని గిరిజనేతరులకు మాఫీ అమలు చేయడం లేదని... ఇది దారుణమని అన్నారు. మేనిఫెస్టోకు విరుద్ధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.